రాపిడో యాప్ ద్వారా హైదరాబాద్‌లో ప్రయాణికులు మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. భాగ్యనగరంలో ఏకీకృత రవాణా పరిష్కారాలను అందించడానికి లార్సెన్ అండ్ టూబ్రో మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌తో రాపిడో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నగర ప్రయాణికులకు సంపూర్ణ రవాణా పరిష్కారాలను అందించడానికి, ప్రముఖ బైక్ టాక్సీ, క్యాబ్ , ఆటో-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో తమ యాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టడానికి ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ తో భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులకు బైక్, ఆటో, క్యాబ్, ఇప్పుడు మెట్రో టిక్కెట్‌లతో సహా దాని విస్తృత స్థాయి సేవలతో సమగ్రమైన ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తోంది. ప్రయాణీకులు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను సౌకర్యవంతంగా బుక్ చేసుకోవచ్చు.
మెట్రో రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (పిపిపి) అయిన హైదరాబాద్ మెట్రో రైలు, దాదాపు ఐదు లక్షల మార్కును తాకుతూ ప్రతిరోజూ సగటున 4.80 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రశంసనీయమైన రోజువారీ రైడర్‌షిప్‌ను సాధించింది. రాపిడో యొక్క విస్తృతమైన యూజర్ బేస్ , వినియోగదారు-అనుకూల యాప్ ఇంటర్‌ఫేస్‌తో, హైదరాబాద్‌లో మెట్రో సేవల మొత్తం సామర్థ్యాన్ని, లభ్యతను పెంపొందించడానికి, కనీసం 15 శాతం మెట్రో టిక్కెట్‌లను రాపిడో యాప్ ద్వారా కొనుగోలు చేస్తారని అంచనా వేస్తున్నారు. రాపిడో సహ- వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి ఈ భాగస్వామ్యం పట్ల తన సంతోషాన్ని వెల్లడిస్తూ రాపిడో యాప్‌లో మెట్రో టిక్కెట్ బుకింగ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా మా వినియోగదారులకు కేవలం రైడ్ కంటే ఎక్కువ అందిస్తున్నామన్నారు.
దాదాపు ఐదు లక్షల మంది రోజువారీ రైడర్లతో నగర రవాణా వ్యవస్థలో అంతర్భాగంగా మెట్రో మారింది. ఎల్ అండ్ టి, ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ తో భాగస్వామ్యం ద్వారా ప్రయాణంలో మొదటి, చివరి మైలును సజావుగా కనెక్ట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాపిడోతో కలిసి ఈ భాగస్వామ్య పథకాన్ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామని ఎల్ అండ్ టి, ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండి అండ్ సీఈఓ కెవిబి రెడ్డి అన్నారు. ఈ భాగస్వామ్యం వినియోగదారుల కోసం మెట్రో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడంలో మా నిబద్ధతను సూచిస్తుందన్నారు.