లండన్/ఢిల్లీ: భారత రచయిత పెరుమాళ్ మురుగన్ రచించిన తమిళ నవల ‘పైర్’కు బుకర్‌ప్రైజ్ 2023 పురస్కారం లభించింది. బుకర్‌ప్రైజ్ ఫౌండేషన్ మంగళవారంప్రకటించిన లాంగ్‌లిస్టులో ‘పైర్’కు స్థానం దక్కింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన 13 పుస్తకాల్లో మురుగన్ తమిళ నవల ‘పైర్’ ఒకటి. 56ఏళ్ల మురుగన్ 2016లో ‘పైర్’ నవల రచనతో ప్రతిష్ఠాత్మక రచయితల జాబితాలో చేరారు. 13 రచనల లాంగ్‌లిస్టులోకి ప్రవేశించిన తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు. ‘పైర్’ నవల ఒక కులాంతర జంట పారిపోయిన నేపథ్యంలో రచించిన కథను తెలుపుతోంది.
మే 23న ప్రకటించనున్న ప్రైజ్‌మనీని పురస్కార రచయిత, అనువాదకులు పంచుకోనున్నారు. తమిళనాడులోని సేలంకు చెందిన మురుగన్ తన పుస్తకాల్లో ‘పైర్’ చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. బుకర్ ప్రైజ్ లభించినందుకు సంతోషంగా ఉందని, ‘పైర్’ పరువుహత్యకు సంబంధించిన నవలగా తెలిపారు. పరువు హత్య అనేది మన దేశంలో చాలా పెద్ద సమస్యగా మురుగన్ తెలిపారు. మురుగన్ 10నవలలు, ఐదు చిన్న కథల సంకలనాలు, నాలుగు కవితా సంకలనాలు రచించారు. వాసుదేవన్ వన్ పార్ట్ ఉమన్‌గా అనువదించిన తన నవల మధోరుభగన్‌కి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్నారు. కాగా గత సంవత్సరం హిందీ రచయిత్రి శ్రీ ‘టాంబ్ ఆఫ్ శాండ్’ పుస్తకానికి అనువాద రచనల విభాగంలో అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ రచయిత్రిగా నిలిచారు.