Saturday, November 23, 2024

ఎమ్మెల్యేలు వాడరాని పదాలతో బుక్‌లెట్

- Advertisement -
- Advertisement -

Booklet with words not used by MLAs

భోపాల్:  ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాడకూడని పదాలతో కూడిన ఓ చిన్నపాటి పుస్తకాన్ని మధ్యప్రదేశ్‌లో వెలువరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలు సోమవారం ఆరంభం అవుతాయి. దీనికి ముందు ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ బుక్‌లెట్ ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యేలు సభలలో ఏ పదాలు వాడకూడదు. ఏవి అన్‌పార్లమెంటరీ అనే విషయాలు , ఇంతకు ముందు సభలలో తొలిగించిన పదజాలాలు, వ్యాఖ్యలను ఇందులో పొందుపర్చారు. కేవలం పదాలే కాకుండా వ్యాఖ్యలు, సామెతలు, పలుకుబళ్లు వంటివి గేలిచేసే విధంగా ఉండేవి ఇందులో పొందుపర్చారు. ఎమ్మెల్యేలు సభలో ఈ బుక్‌లెట్‌ను చూసుకుని తమ ప్రమాణాలను నిలబెట్టుకోవచ్చునని అధికారులు తెలిపారు. దాదాపుగా 1161 పదాలు, వ్యాక్యాలతో ఈ బుక్‌లెట్‌ను రూపొందించారు. పప్పూ, తానాషా, మిస్టర్ బంటాధార్ వంటివి వాడకూడని పదాలతో కూడిన బుక్‌లెట్‌లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News