Saturday, March 29, 2025

డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిలమ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది. మేకర్స్ ‘బూమరాంగ్’ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు. గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్‌లో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆండ్రూ మంచి టెక్నిషియన్. తను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సినిమాకే కర్మ థీమ్ తీసుకున్నాడు.

చాలా ఛాలెజింగ్ కాన్సెప్ట్ ఇది. విజువల్స్ చాలా బావున్నాయి. శివ కందుకూరి మంచి యాక్టర్. డిఫరెంట్ కథలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి డిఫరెంట్ థీం వున్న థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఒక డార్క్ సైడ్ వుంది. ‘బూమరాంగ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది’ అని తెలిపారు. డైరెక్టర్ ఆండ్రూ బాబు మాట్లాడుతూ..‘నేను కెమెరామెన్‌గా ఎన్నో సినిమాలు చేశాను. డైరెక్షన్ చేయాలని కోరిక ఎప్పటినుంచో ఉండేది. కరోనా సమయంలో చాలా కథలు రాశాను. అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసిన కథ ‘బూమరాంగ్’. ఈ కథ చెప్పినప్పుడు ప్రవీణ్ వెంటనే ఒప్పుకున్నారు. ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, విజయ్ కుమార్ కొండా, నిర్మాత డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News