Thursday, January 30, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం ఓ శాంపిల్ గవర్నమెంట్:బూర నర్సయ్య గౌడ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఓ శాంపిల్ గవర్నమెంట్ అంటూ మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సెటైర్ వేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా శాంపిల్స్ మాత్రమే ఉంటోందని దుయ్యబట్టారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లోకి టకీ టకీమని పడతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటి వరకు టికీ లేదు పిక్కి లేదు అని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు,

ఇందిరమ్మ ఇండ్లు ఏది ఇచ్చినా కేవలం శాంపిల్స్ మాత్రమే ఇస్తోందని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా సాధారణంగా నాలుగేళ్లకు విఫలం అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏడాదిలోపే అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. ఈ అంశాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సెంటిమెంట్ అంశాలు తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. మీడియా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును గమనించాలని కోరారు. ఈ రోజు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడమే కాకుండా ఆ పార్టీలో ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కవని నర్సయ్యగౌడ్ జోస్యం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News