సిరిసిల్ల: కాళ్లతో కవిత్వం రాసే దివ్యాంగ మహిళ బూర రాజేశ్వరి(30)బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో సిరిసిల్ల(కెసిఆర్ నగర్ మండెపల్లిలో)లో ఆకస్మికంగా మృతి చెందింది. సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి చేతులు పనిచేయక పోవడంతో కాళ్లతో కవీత్వం రాయడం నేర్చుకుంది. విషయం మీడియా ద్వారా తెలుసుకున్న పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ 1995లో తన తండ్రి హన్మంతు పేరిట అవార్డును రాజేశ్వరికి అందించి రాజేశ్వరి రాసిన కవితలను రాజేశ్వరి కవితల పేరిట ముద్రించారు.
రాజేశ్వరి గురించి తెలుసుకున్న సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ స్పందించి ఆమెకు నెలకు పది వేల రూపాయల పెన్షన్ ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇచ్చారు. పది లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. మంత్రి కెటిఆర్ సహ పలువురు ప్రముఖులు రాజేశ్వరిని ప్రశంసించారు. పలువురు సత్కరించారు. కాళ్లతో కవీత్వం రాసే దివ్యాంగ మహిళ రాజేశ్వరి మరణవార్త తెలిసి పలువురు సంతాపం ప్రకటించారు.