Saturday, November 23, 2024

జీహెచ్‌ఎంసిలో ఇంటికే బూస్టర్‌డోసు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: 60ఏళ్లు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఇంటికే వచ్చి బూస్టర్ డోసు వేసేలా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. 60ఏళ్లు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రభుత్వం బూస్టర్ డోస్ వేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, వ్యాక్సినేషన్ సెంటర్ గాని వెళ్లి వ్యాక్సినేషన్ వేసుకోనివారు జీహెచ్‌ఎంసి హెల్ప్ లైన్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి బూస్టర్ డోస్‌ను వేయనున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుల ఆదేశాల మేరకు కోమోర్బిడిటిస్ ఉన్నవారు వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు బూస్టర్ డోస్ తీసుకోని వారి కోసం జిహెచ్‌ఎంసిలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ కు ఫోన్ చేస్తే సంబంధిత జోన్, సర్కిల్, వార్డుకు సంబంధించిన బాధ్యులకు తెలియజేసి మొబైల్ వాహనం ద్వారా ఇంటికి వచ్చి వాక్సినేషన్ వేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Booster Dose at Doorstep in GHMC

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News