Friday, November 22, 2024

బూస్టర్ డోసు 39 కేంద్రాల్లో పంపిణీ

- Advertisement -
- Advertisement -

సెంటర్లు తెలియకపోవడంతో
ఒకే దగ్గర గుంపులు
ఎక్కడ పంపిణీ చేస్తున్నారో ప్రచారం
చేయాలంటున్న జనం
12 కేంద్రాల్లో కోవాగ్జిన్, 27 సెంటర్లో
కోవిషీల్డ్ వేస్తున్న సిబ్బంది

 

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో వైరస్ విజృంభణ చేయకుండా వైద్యశాఖ ముందస్తు చర్యలో భాగంగా 39 ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోసు పంపిణీ చేపట్టడ ం తో స్థ్దానిక ప్రజలు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో కేం ద్రాలు వస్తున్నారు. మొదటి రోజు తక్కువ సంఖ్యలో వ చ్చిన రెండో రోజు వ్యాక్సిన్ కోసం జనం క్యూ కట్టారని వై ద్య సిబ్బంది పేర్కొంటున్నారు. థర్డ్ వేవ్ సమయంలో బూస్టర్ తీసుకోవాలని ప్రచారం చేసిన ప్రజలు పెద్దగా ప ట్టించుకోలేదు. కొంతమంది కరోనా సెకండ్ డోసు కూడా నిర్లక్షం చేశారు. ప్రస్తుతం ప్రపంచ  దేశాలను మహమ్మారి వణికిస్తుండటంతో పోర్త్ వేవ్ పొంచి ఉందని గుర్తించిన వైద్యశాఖ వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచనలు చేయడంతో నగరవాసులు మరోసారి టీకా కోసం వెతుకులాడుతున్నారు.

గ్రేటర్‌లో కరోనా పాజిటివ్ కేసులు గత వారం రోజుల నుంచి 10 కేసులకు మించి కావడం లేదని, ఇదే విధంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో వైరస్‌ను నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. బూస్టర్ డోసు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియక పోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లుతున్నారు. ఒక కేంద్రం దగ్గర గుంపులుగా, మరో కేంద్ర వద్ద ఐదారు మందికి మించి ఉండటం లేదు. స్దానిక ఆరోగ్య కార్యకర్తలు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ప్రచారం చేస్తే సమీప ఆరోగ్య సెంటర్లకు జనం వెళ్లుతారని కార్పొరేటర్లు చెబుతున్నారు.

బూస్టర్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు కోవాగ్జిన్ సిపిపిఎస్ అందుబాటులో ఉన్న సెంటర్లు బంజారాహిల్స్ యుపిహెచ్‌సి, బొల్లారం, సెంట్రల్ రైల్వే ఆసుపత్రి, ఈఎస్‌ఐ యుపిహెచ్‌సి, గొల్కొండ, జూబ్లీహిల్స్, కార్వాన్, పంజేస్, పికెట్, పంజాగుట్ట, ఆర్‌ఎఫ్‌పిటిసి, తిలక్‌నగర్ ఉన్నట్లు మెడికల్ అధికారులు తెలిపారు. అదే విధంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ బాలగంజ్ యుపిహెచ్‌సీ, బండ్లగూడ, బంజారాహిల్స్, బార్కాస్, బోలక్‌పూర్, సెంట్రల్ రైల్వే ఆసుపత్రి, చింతల్‌బస్తీ, ఈఎస్‌ఐ, ఫిల్మ్‌నగర్, గొల్కొండ, జహనుమా, కార్వాన్, కుట్టివెలుడి, మలక్‌పేట, ముషీరాబాద్, పానీపురా, పంజేష్, పికెట్, పంజాగుట్ట, ఆర్‌ఎఫ్‌పిటిసి, సనత్‌నగర్, శాంతినగర్, తిలక్‌నగర్, ఉప్పుగూడ, యాకుత్‌పురా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

12 కేంద్రాల్లో కోవాగ్జిన్, 27 సెంటర్లలో కోవిషీల్డ్ పంపిణీ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజుకు సుమారుగా 40 నుంచి 50 మందికి పంపిణీ చేస్తున్నట్లు, లబ్దిదారులు ఆధార్‌కార్డు తీసుకుని రావాలని, ఇతర వ్యాధులున్న వారు వైద్యులను సంప్రదించి టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.నగర ప్రజలు వ్యాక్సిన్ పట్ల నిర్లక్షం చేయకుండా సకాలంలో తీసుకుని, మహమ్మారిని తరిమికొట్టాలని, అదే విధంగా బయటకు వెళ్లితే మాస్కులు, భౌతికదూరం తప్పకుండా పాటించాలని కోరుతున్నారు. జనవరిలో చలి తీవ్రత పెరిగే అవకాశ ఉందని, సంక్రాంతి పండుగ, ఇతర వేడుకలుంటే పరిమిత సంఖ్యలో చేసుకోవాలని, గుంపులు ఉంటే కరోనా ఉనికి చాటుతుందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News