Friday, January 24, 2025

విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోస్

- Advertisement -
- Advertisement -
Booster dose for those going abroad
కేంద్రం తాజా ఆఫర్ త్వరలో నిర్ణయం
విద్య ఉద్యోగార్థులకు వెసులుబాటు
క్రీడాకారులు, వ్యాపారవేత్తలకు ఛాన్స్

న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే భారతీయులకు త్వరలోనే కొవిడ్ 19 టీకా బూస్టర్ డోస్ అందనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధివిధానాలతో నిర్ణయం వెలువరించనుంది. విద్యాభ్యాసం, ఉద్యోగాలు, క్రీడలలో పాల్గొనడం, విదేశీ సెమినార్లకు వెళ్లేవారికి ఈ బూస్టర్ డోస్‌లు కొవిడ్ నియంత్రణ దిశలో ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇప్పటివరకూ రెండు డోసుల టీకా కార్యక్రమం ముగించుకుని విదేశీప్రయాణాలకు వెళ్లే వారు అక్కడ బూస్టర్ డోస్ వేయించుకోవడానికి పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ శ్రేణుల వారికి బూస్టర్ డోస్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది. అనేక మంది భారతీయులు వ్యాపార లావాదేవీలు, అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు కూడా విదేశాలకు వెళ్లుతున్నారు. వీరందరికి కూడా ఈ బూస్టర్ డోస్ సౌకర్యం ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ బూస్టర్ డోస్ పొందాలనుకునే వారు ప్రైవేటు క్లినిక్‌లలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పుడు ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధం పనులలో ఉన్న వారు, 60 ఏండ్లు పైబడ్డ వారు ఈ అదనపు వ్యాక్సిన్లను పొందుతున్నారు.

ఆదివారం నుంచి అంతర్జాతీయ విమానయానాలు మునుపటి రీతిలోనే పునరుద్ధరణ జరుగుతున్నందున అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని విదేశీ ప్రయాణాలకు వెళ్లే భారతీయుల విషయంలో ఇప్పుడు ఈ సరికొత్త నిర్ణయానికి వచ్చారు. థర్డ్‌డోస్ లేకుండా కొన్ని నిర్ణీత దేశాలకు వెళ్లడం వల్ల వైరస్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకూ విదేశీయానాలకు సరైన అవకాశాలు లేవు. కానీ ఇప్పుడు ఇంతకుముందటిలాగానే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఆరంభం అవుతున్నందున బూస్టర్ డోస్ ప్రాధాన్యత పెరిగింది. కీలక విషయాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిగణనలోకి తీసుకుంది. బూస్టర్ లేదా నివారణ డోస్‌ల విషయంలో అనుమతికి తుది నిర్ణయం దశకు వచ్చిందని వెల్లడైంది. అయితే ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సత్వరరీతిలోనే దీనిపై నిర్ణయం అధికారికంగా వెలువరిస్తారు. ఇప్పుడున్న మార్గదర్శక సూత్రాల పరిధిలోనే రెండో డోస్ పూర్తి అయిన మూడు నెలలకు బూస్టర్ డోస్‌కు ప్రాధాన్యత ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News