Friday, November 15, 2024

30 ఏళ్లుపైబడిన వారందరికీ బ్రిటన్‌లో బూస్టర్ డోసు

- Advertisement -
- Advertisement -

Booster dose in Britain for all over 30s

 

లండన్ : బ్రిటన్‌లో ఒమిక్రాన్‌పై పోరులో భాగంగా 30 ఏళ్లు, అంతకు మించి వయసున్నవారందరికీ సోమవారం నుంచి బూస్టర్ డోసు ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సోమవారం నుంచి బూస్టర్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్టు ఆదివారం వెల్లడించింది. బ్రిటన్‌లో 30 నుంచి 39 ఏళ్ల వారు 7.5 మిలియన్ మంది ఉండగా, వారిలో 3.5 మిలియన్ మంది సోమవారం నుంచి బూస్టర్ డోసు పొందడానికి అర్హులుగా తేలిందని నేషనల్ హెల్త్ సర్వీస్ ఇంగ్లాండ్ వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను బూస్టర్ డోసులు సమర్ధంగా ఎదుర్కొంటాయని ప్రాథమిక పరిశీలనలో తేలిందని చెప్పింది. అయితే ఇప్పటివరకు ఒమిక్రాన్‌తో ఎలాంటి మరణం సంభవించక పోయినా ఈ ఏడాది ఆఖరుకు ఇది డెల్టాను కూడా అధిగమిస్తుందని వైద్యనిపుణలు హెచ్చరించారని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News