వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంతో ప్రపంచ దేశాలను చుట్టుముడుతోందని, రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్‌తో బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉన్నందున తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలని అమెరికా అద్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ అమెరికన్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయడం ఇన్‌ఫెక్షన్ ముప్పును మరింత పెంచుతుందని హెచ్చరించారు. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీడే సీజన్ కావడంతో ప్రజలు విహార యాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేగాన్ని కట్టడి చేయాలంటే మాస్కులు ధరించడంతోపాటు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్ అమెరికాలో సగానికి పైగా రాష్ట్రాల్లో వెలుగు చూసిందని చెప్పారు.
Booster Dose work against Omicron:Dr Anthony Fauci