Friday, November 22, 2024

నేటి నుంచి బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచంలోనే రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసిన భారత్‌కు ఈ సిరీస్ సవాల్ వంటిదేనని చెప్పాలి.

దీనికి తోడు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండా భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది. స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. బుమ్రా జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కంగారూలు ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు.

జట్ల వివరాలు:
భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, దేవ్‌దుత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, అశ్విన్, ఆకాశ్‌దీప్, జస్‌ప్రిత్ బుమ్రా (కెప్టెన్), సిరాజ్, సర్ఫరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, హర్షిత్ రాణా, సుందర్, అభిమన్యు ఈశ్వరన్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, నాథన్, లబుషేన్, స్మిత్, హెడ్, మిఛెల్ మార్ష్, అలెక్స్ కారే, స్టార్క్, కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, హాజిల్‌వుడ్, ఇంగ్లిస్, బొలాండ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News