తప్పించుకొనే యత్నంలో కాళ్లకు బులెట్ గాయాలు
అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలో భారత్‌పాక్ సరిహద్దులోని హరామీ నాలా జలసంధిలో ఇద్దరు పాక్ మత్సకారులను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి. అయితే వీరు తప్పించుకుని పారిపోడానికి ప్రయత్నించడంతో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో వీరి కాళ్లకు బులెట్ గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని బిఎస్‌ఎప్ ప్రకటించింది. ఈ నెల 23న వీరి కోసం గాలింపు ప్రారంభం కాగా, చివరకు శుక్రవారం దొరికారని తప్పించుకుని పాకిస్థాన్ వైపు పారిపోడానికి ప్రయత్నించడంతో తుపాకీ కాల్పులకు వారి కాళ్లకు తూటా గాయాలయ్యాయని భుజ్ బిఎస్‌ఎఫ్ ప్రకటించింది. గురువారం గస్తీ కాస్తుండగా హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థాన్ చేపల బోట్ల కదలికలు గమనించామని బిఎస్‌ఎఫ్ పేర్కొంది. నిందితులు సదామ్ హుస్సేన్ (20), అలీ బక్ష్ (25) పాకిస్థాన్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.