- Advertisement -
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో విజయం సాధించాలంటే భారత్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం ఎంత పెద్ద జట్టుకైనా చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. ఇలాంటి స్థితిలో అక్కడ పర్యటించే ప్రతి జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండడం సహాజమేనన్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నదన్నాడు. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి తేరుకోవడం భారత్‌కు అంత సులువుకాదన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎటాకింగ్ గేమ్‌తో ముందుకు సాగడం తప్పించి భారత్ ముందు మరో మార్గం లేదన్నాడు. అంతేగాక ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సమర్థంగా పోషించాలన్నాడు. అప్పుడే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నాడు.
- Advertisement -