Monday, December 23, 2024

పాత్రికేయ వృత్తి ముసుగులో చీకటి దందాలు

- Advertisement -
- Advertisement -

సుజాతనగర్ : మండలంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పాత్రికేయ వృత్తిని అడ్డు పెట్టుకుని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక ప్రైవేట్ వెంచర్‌లో బోర్లు వేపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా సదరు విలేకరి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి అక్రమంగా మట్టి తొలకాలు అర్థరాత్రులు బోర్లు వేయడం వంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను తప్పుదోవ పట్టిస్తూ వారికి కావల్సిన పనులను చేపించుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది.

గత నాలుగు రోజుల క్రితం మండలంలోని మంగపేట పంచాయతీ పరిధిలోని వెంచర్‌లో ఒక్క బోరు వేసేందుకు అనుమతి తీసుకుని దాదాపు 21 వరకు బోర్లు వేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. వారి వద్ద నుంచి ముడుపులు అందడం వల్లే అధికారులు ఈ బోర్ల దందాను పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తగా బోరు వేయాలంటే తహసీల్ధార్ అనుమతులు తప్పనిసరి అని అందరికీ తెలసిందే, నిజానికి భూగర్భ జలాల పరిరక్షణ విభాగ అధికారులు బోరు వేయాల్సి వస్తే స్థలాన్ని పరీక్షించి అనుమతులు ఇస్తారు.

కానీ వారు అధికారుల అనుమతి, ప్రమేయం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రులు బోర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పర్యావరణ పరిరక్షణ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News