Tuesday, January 21, 2025

వాహ్ భారత్…. ఏమాతిధ్యం …

- Advertisement -
- Advertisement -

Boris Johnson felt like Sachin, Amitabh in India

అమితాబ్ సచిన్‌లా ఫీలయ్యా : జాన్సన్

న్యూఢిల్లీ : గుజరాత్ పర్యటన తనకు అమితానందం కల్గించిందని తనకు తాను అమితాబ్ బచ్చన్ లేదా సచిన్ టెండూల్కర్ లా అన్పించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతసించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన తమ గుజరాత్ పర్యటన అనుభవాలను ప్రస్తావించారు. విలేకరులతో అక్కడి అనుభవాలను పంచుకున్నారు.అహ్మదాబాద్ సబర్మతి పలు చోట్ల తన భారీ కటౌట్లు గానా బజానాలు చూసి తను ఉప్పొంగిపొయ్యానని, మీరు చూసే ఉంటారు బుల్‌డోజర్ల కంపెనీలో తాను బుల్‌డోజర్‌పైకి దూకేశానని , భారత్‌లో ఆతిధ్యం ఇంత గొప్పగా ఉంటుందని తాను అనుకోలేదని, ఇంతటి ఆదరణీయ గౌరవం మరోచోట దొరకదని ఖచ్చితంగా చెప్పగలనని వెల్లడించారు. బిగ్ బి, సచిన్ అయిపోయినంత ఆనందం కల్గిందని ప్రధాని మోడీ సమక్షంలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News