Sunday, November 24, 2024

కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో బ్రిటన్ ప్రధాని బర్త్‌డే వేడుకలు

- Advertisement -
- Advertisement -
Boris Johnson held lockdown birthday party
మెట్రో పోలీసుల విచారణ ప్రారంభం

లండన్ : కొవిడ్ ప్రారంభంలో లాక్‌డౌన్ విధించినప్పుడు బర్త్‌డే వేడుకలను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జరుపుకున్నారని వచ్చిన ఆరోపణలపై మెట్రో పోలీసులు విచారణ ప్రారంభించారు. అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో 2020 జూన్‌లో కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి ప్రధాని బోరిస్ జాన్సన్ 56 వ పుట్టిన రోజు వేడుకకు ప్రముఖులు హాజరైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఇండోర్ కార్యక్రమాల్లో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పాల్గొనరాదని ఆంక్షలు కఠినంగా విధించి ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికి 30 మంది వరకు హాజరయ్యారని వారంతా బర్త్‌డే కేక్ కోసం హ్యాపీ బర్త్‌డే పాటలు పాడారని ఐటివి న్యూస్ సోమవారం రాత్రి తాజాగా వెల్లడించింది.

ఇదంతా అధికారిక క్యాబినెట్ రూమ్‌లోనే ఆరోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత జరిగిందని దీనికి ఆనాడు జాన్సన్ కాబోయే భార్య, ప్రస్తుత భార్య కేరీ సైమండ్స్ పాల్గొన్నారని ఆరోపించింది. ఈ విధంగా కొవిడ్ ఆంక్షల ఉల్లంఘన కేసుపై విచారణ చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ క్రెసిడా డిక్ తెలిపారు. నెంబర్ 10 లో ఉన్న ప్రధాని ఇంట్లో బర్త్‌డే వేడుకలు జరిగినట్టు డౌనింగ్ స్ట్రీట్ అంగీకరించింది. దీనిపై సీనియర్ అధికారి మాగ్రే విచారణ చేపట్టనున్నట్టు క్యాబినెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే కరోనా ఆంక్షల సమయంలో ఎలా వేడుకలు నిర్వహిస్తారని ప్రధాని బోరిస్‌ను విపక్షాలు నిలదీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News