లండన్: రష్యా అధ్యక్షులు పుతిన్‌కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కావల్సి ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రపంచ నేతలకు పిలును నిచ్చారు. ఈ దిశలో ముందుకు సాగేందుకు కలిసిరావాలని వారిని ఆహ్వానించారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ ర్యూటేలకు లండన్‌లోని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ త్రయం బ్రిటన్ సాయుధ దళాల సభ్యులను కలుసుకునేందుకు ఇక్కడి రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) స్థావరాన్ని సందర్శించారు. రష్యా అతిక్రమణ ధోరణి, అరాచాకాలను ఎదుర్కొనే దిశలో ప్రపంచవ్యాప్త స్పందన అవసరం అని ఈ దిశలో కదలిక ఆచరణాత్మకం కావల్సి ఉందని, ముగ్గురు నేతల భేటీ ఈ దిశలో ఆరంభ ఘట్టం అని డౌనింగ్ స్ట్రీట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటి ప్రయత్నాలతో ఇక ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల సాయం మరింత వేగవంతం అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ నగరాలపై దాడులకు పుతిన్ ఇచ్చిన ఆదేశాలపై ప్రధానులు దృష్టి సారించారు. త్వరలోనే నేతల మధ్య ద్వైపాక్షిక ఆ తరువాత త్రైపాక్షిక సమావేశాలు ఏర్పాటు కావలని ప్రధాన మంత్రులు నిర్ణయానికి వచ్చారు. రష్యా చట్ట వ్యతిరేక చర్యలకు, అనాగరిక దాడులకు అంతా సంఘటితంగా వ్యవహరించి, ఉక్రెయిన్‌లకు సంఘీభావంగా నిలవాల్సి ఉందని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో బాధిత ప్రజలకు బ్రిటన్ నుంచి ఎప్పటికప్పుడు కావల్సిన సాయం అందుతోందని వివరించారు. ఉక్రెయిన్ కడగండ్లను పూర్తి స్థాయిలో నివారించే స్థాయిలో ఉన్న పుతిన్ ఈ దిశలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారనే విశ్వాసాన్ని జాన్సన్ వ్యక్తం చేశారు. యుద్ధంతో తలెత్తుతున్న అమానుష పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి సాయం దిశలో ఇప్పటి తమ భేటీ మరింత ముందడుగు అవుతుందని తెలిపారు. ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు రష్యా అదనంగా ఉక్రెయిన్ ప్రభుత్వ బడ్జెట్‌కు నేరుగా 100 మిలియన్ డాలర్లను కేటాయించింది. రష్యా చర్యలతో తలెత్తిన ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ సాయం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు పలు విధాలుగా వైద్యసాయం, నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతోందని, అత్యవసరంగా సాయం అందాల్సిన వారిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నామని జాన్సన్ తెలిపారు. ఉక్రెయిన్‌కు అందించిన ఆర్థిక సాయంతో అక్కడి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా కీలక విషయాలకు ఊతం ఏర్పడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రభుత్వానికి నేరుగా సాయం అందించే దిశలో గత వారం ఏర్పాటు అయిన ప్రపంచ బ్యాంక్ మల్టీ డోనర్ ట్రస్ట్ ఫండ్ ద్వారా బ్రిటన్ గ్రాంటు అందచేశారు.
Boris Johnson invites world leaders to allies against Russia