Thursday, November 14, 2024

రహస్యంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ మూడో పెళ్లి

- Advertisement -
- Advertisement -

Boris Johnson Married in Stealth Ceremony

లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా శనివారం మూడో పెళ్లి చేసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్‌లో ప్రియురాలు కారీ సైమండ్స్‌ను పెళ్లి చేసుకున్నారని బ్రిటన్ పత్రికలు ది సన్, మెయిల్ ఆన్ సండేవర్క్ లాంటి టాబ్లాయిడ్లు ప్రముఖంగా ప్రచురించాయి. సెంట్రల్ లండన్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు చివరి నిమిషంలో అతిధులకు ఆహ్వానాలు అందాయి. ప్రధాని కార్యాలయం లోని సీనియర్ అధికారులకు ఎవరికీ తెలియనీయ లేదు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు కొనసాగుతుండడంతో 30 మంది అతిధులకు మాత్రమే పెళ్లి వేడుకకు అనుమతి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వీరి పెళ్లి జరిగిన కేథడ్రల్ చర్చిని మూసివేశారు.

అరగంట ఆలస్యంగా 33 ఏళ్ల సైమాండ్స్ తెల్లని గౌను ధరించి లిమోజిన్ వాహనంలో అక్కడకు వచ్చారని కథనాలు వెల్లడించాయి. బోరిస్ ప్రధాని అయ్యాక తన గర్ల్ ఫ్పెండ్ సైమాండ్స్‌తో కలసి డౌనింగ్ స్ట్రీట్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. 2020 ఫిబ్రవరిలో వీరు నిశ్చితార్ధం చేసుకున్నారు. బోరిస్ జాన్సన్ వయస్సు 56 కాగా, సైమాండ్ వయస్సు 33 ఏళ్లు. వీరికి 2020 ఏప్రిల్‌లో బాబు పుట్టాడు. 2022 లో వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా వీరు పెళ్లి చేసుకోవడం బ్రిటన్‌లో సంచలనం కలిగించింది.

వివాహ బంధం విషయంలో గతంలో జాన్సన్ విమర్శలు ఎదుర్కొన్నారు. జాన్సన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వివాహేతర సంబంధం గురించి అబద్ధం చెప్పారని కర్సర్వేటివ్ పార్టీ పాలసీ బృందం నుంచి జాన్సన్ ను తొలగించారు కూడా. గతంలో రెండు పెళ్లిళ్లు జరిగినా వారిద్దరితో సంబంధాలు తెంచుకున్నారు. రెండో భార్య న్యాయవాది అయిన మారినా వేలర్‌కు నలుగురు సంతానం. వీరిద్దరూ విడిపోయినట్టు 2018 సెప్టెంబర్‌లో ప్రకటించారు. 1822 లో ఆనాటి ప్రధాని లార్డ్ లివర్‌పూల్ తరువాత బ్రిటన్ ప్రధాని పదవిలో ఉంటూ పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తి బోరిస్ జాన్సన్ అవుతారు.

Boris Johnson Married in Stealth Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News