Friday, December 27, 2024

బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ
2 ఉప ఎన్నికల్లో కన్జర్వేటివ్ అభ్యర్థుల ఓటమి

లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ రెండు ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది. టివర్టన్, హానిటన్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో లిబరల్ డెమోక్రట్ పార్టీ అభ్యర్థులు అధికార కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులను ఓడించారు. కాగా..ఉత్తర ఇంగ్లండ్‌లోని వేక్‌ఫీల్డ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ గెలుపొంది తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల వరుస రాజీనామాల పర్యవసానంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బోరిస్ జాన్సన్ పాలనపై తమ తిరస్కృతిని ఓట్ల రూపంలో ప్రదర్శించారు. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిష్ట మసకబారినట్లు పరిశీలకుల అంచనా.

Boris Johnson Party lost two seats in bypolls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News