ఇండోపసిఫిక్ ప్రాంత వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ ఏడాది ఏప్రిల్ చివరన భారత్‌లో పర్యటిస్తారని ఆయన అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండోపసిఫిక్ ప్రాంతంలో తమ వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని బలోపేతం చేసుకునేదిశగా ఈ పర్యటన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బయటపడిన తర్వాత బ్రిటన్ ప్రధాని జరిపే మొదటి విదేశీ పర్యటన ఇదే కానున్నది. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావాల్సి ఉండగా, బ్రిటన్‌లో కొవిడ్19 తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ పర్యటనలో భాగంగా భారత్‌బ్రిటన్ మధ్య మెరుగైన వాణిజ్య భాగస్వామ్యం(ఇటిపి), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టిఎ)కు తుదిరూపు ఇవ్వనున్నట్టు భావిస్తున్నారు. ఇరు దేశాల ప్రధానులు ఇటిపిపై సంతకాలు చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. బ్రిటన్ తన విజన్ 2030కి అనుగుణంగా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Boris Johnson to visit India in April End