Sunday, December 22, 2024

బోరుగడ్డ అనిల్ రిమాండ్ 14 రోజులు పొడగింపు

- Advertisement -
- Advertisement -

రాజమండ్రి: వైసిపి సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ రిమాండ్ ను  న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు న్యాయస్థానం… తాజాగా మరో 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దాంతో బోరుగడ్డ అనిల్ నవంబరు 12 వరకు రిమాండ్ లోనే ఉండనున్నాడు. కాగా పోలీసులు బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

గుంటూరులో కర్లపూడి బాబుప్రకాశ్ అనే వ్యక్తిని రూ 50 లక్షలు డిమాండ్ చేసినందుకు బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇటీవలే కోర్టు మూడు రోజులు కస్టడీకి అనుమతించడంతో, గుంటూరు పోలీసులు అనిల్ ను ప్రశ్నించారు. ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా అతడిని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, జగన్ ఎవరో తనకు తెలియదని అతడు పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. కాగా బిజెపి నేత, ఏపి మంత్రి సత్యకుమార్ యాదవ్ పై గతేడాది మార్చి 31న జరిగిన దాడికి సంబంధించి బోరుగడ్డ అనిల్ పై మరో కేసు కూడా నమోదైంది. ఈ దాడి కేసులో వైసిపి మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏ1 నిందితుడిగా, బోరుగడ్డ అనిల్ ఏ2 నిందితుడుగా ఉన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News