Monday, December 23, 2024

సరి కొత్త సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను పరిచయం చేసిన బోచ్

- Advertisement -
- Advertisement -

గృహోపకరణాల పరిశ్రమలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన BSH Hausgeräte GmbH యొక్క అనుబంధ సంస్థ BSH హోమ్ అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ , భారతీయుల యొక్క దుస్తుల శుభ్రత అవసరాలను తీర్చడానికి అత్యంత ఖచ్ఛితత్త్వం తో రూపొందించబడిన, ‘మేడ్-ఇన్-ఇండియా’ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల యొక్క సరికొత్త శ్రేణిని పరిచయం చేసింది. వినియోగదారు-కేంద్రీకృతత మరియు మేక్ ఇన్ ఇండియా యొక్క నైతికత పట్ల అచంచలమైన నిబద్ధతతో, అసమానమైన లాండ్రీ అనుభవాన్ని Bosch అందజేస్తుంది. అత్యుత్తమ ఫాబ్రిక్ కేర్ మరియు సౌకర్యాన్ని #LikeABosch గా అందిస్తుంది. నాణ్యత మరియు డిజైన్ పరంగా జర్మన్ ప్రమాణాలతో సరిసమానంగా తయారు చేయబడిన ఈ వాషింగ్ మెషీన్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్వసనీయత మరియు పనితీరును నిర్ధారిస్తాయి.

ఈ కొత్త సెమీ ఆటోమేటిక్ శ్రేణి పీకాక్ బ్లూ, వైన్, లిలక్, కోరల్ పింక్, టాన్జేరిన్ ఆరెంజ్, షాంపైన్ గోల్డ్ మరియు షైనింగ్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది. ఈ వినూత్న శ్రేణి లో ప్రధాన ఆకర్షణగా ఆహ్లాదకరమైన డిజైన్ నిలుస్తుంది. మిగిలిన వాటికి భిన్నంగా వీటిని ఇది నిలుపుతుంది. వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందించడానికి, లాండ్రీ పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన వినియోగదారు కేంద్రీకృత ఫీచర్‌లతో ఇవి తీర్చిదిద్ద బడ్డాయి. వినియోగదారులకు ప్రయోజనం కలిగించే అంశాలలో…

సాటి లేని సౌలభ్యం

• Large Lid Opening : ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద దుప్పట్లు మరియు బొంతలను మెషిన్ లోపలకు పంపవచ్చు మరియు బయటకు తీయవచ్చు . ఇది వినియోగదారులకు లాండ్రీ ప్రక్రియను సౌకర్యవంతంగా చేస్తుంది మరియు పనుల సమయంలో సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది

• Ease of Moving the Machine : తేలికైన డిజైన్, ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్స్ మరియు చక్రాలు మెషిన్ ను సులభంగా కదిపేందుకు వీలు కల్పిస్తాయి. వినియోగదారులు మెషిన్ ను సౌకర్యవంతంగా కావలసిన వాషింగ్ ప్రాంతానికి రవాణా చేయడానికి అనుమతిస్తుంది, ఇది రవాణా మరియు సౌలభ్యాన్ని పెంచుతుంది

• Integrated Scrub Zone : భారీ ఉపరితలంతో కూడిన విస్తృత స్థాయి స్క్రబ్ బేసిన్, పెద్ద వస్త్రాలకు సైతం మెషిన్ వద్ద నేరుగా అనుకూలమైన ఎత్తులో, మరకలకు ముందస్తు ట్రీట్మెంట్ ను సులభతరం చేస్తుంది. మరకలకు ప్రీ ట్రీట్మెంట్ ను సులభతరం చేయటం తో పాటుగా వినియోగదారులకు సౌలభ్యం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శ్రమ రహిత నిర్వహణ

• Flow-in-Frame Feature: నీరు నిల్వ ఉండటం లేకుండా చేస్తుంది. శుభ్రపరిచేందుకు కష్టపడే ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది, అవసరమైన కనీస నిర్వహణతో మెరుగైన రీతిలో మెషీన్ పనితీరును నిర్ధారిస్తుంది

• Covered Control Knobs: నీటికి తడిచిపోకుండా కంట్రోల్ నాబ్‌లను కాపాడుతుంది, వాషింగ్ మెషీన్ యొక్క మన్నికను పెంచుతుంది మరియు దాని జీవిత కాలం గురించి వినియోగదారులకు భరోసా ఇస్తుంది

ఈ కొత్త శ్రేణి వస్త్రాలకు నష్టం కలిగించకుండా , మరకలు పోగొట్టి సౌకర్యవంతమైన లాండ్రీ అనుభవానికి వాగ్దానం చేస్తుంది. ప్రతి వస్త్రాన్ని అత్యంత జాగ్రత్తగా శుభ్రపరుస్తుందనే భరోసా అందిస్తూనే, విస్తృత శ్రేణి రంగుల అవకాశాలతో ఎలాంటి లాండ్రీ ప్రాంగణానికి అయినా సొగసును జోడిస్తూ, లోపాలు లేనట్టి ఉతుకును అందజేస్తుందని Bosch నిర్ధారిస్తుంది.

ఈ ఆవిష్కరణ పై BSH అప్లయెన్సెస్ ఎండి & సీఈఓ సైఫ్ ఖాన్ మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల యొక్క కొత్త శ్రేణిని పరిచయం చేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ఆవిష్కరణతో, లాండ్రీ విభాగంలో మా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం తో పాటుగా భారతీయ వినియోగదారులకు ఫాబ్రిక్ కేర్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నాము. వినియోగదారు-కేంద్రీకృత ఆవిష్కరణల ద్వారా రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడానికి BSH అప్లయెన్సెస్ వద్ద మేము అంకితభావంతో కృషి చేస్తున్నాము. ‘మేక్ ఇన్ ఇండియా’పై దృష్టి సారించి , మా ఉత్పత్తుల యొక్క ప్రతి ఫీచర్ భారతీయ గృహాల యొక్క విభిన్న అవసరాలకు అనుగుణంగా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది…” అని అన్నారు.

ఆవిష్కరణ మరియు వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘మేక్ ఫర్ ఇండియా’ పట్ల తమ నిబద్ధతను BSH అప్లయెన్సెస్ మరింతగా బలోపేతం చేసింది. BSH ఇండియా ఇటీవల భారతదేశంలో డిజైన్ చేయబడిన మరియు తయారు చేయబడిన గృహోపకరణాల శ్రేణికి ఐదు iF డిజైన్ అవార్డులు మరియు నాలుగు ఇండియా డిజైన్ మార్కుల యొక్క ఆకట్టుకునే శ్రేణిని సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News