Thursday, January 23, 2025

బోష్ స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్‌: బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైద‌రాబాద్‌లో ఇవాళ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కేటీఆర్ అన్నారు. న‌గ‌ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ క‌ట్టుబ‌డి ఉన్నార‌ని, దానికి త‌గిన వేగంతోనే అభివృద్ధి జ‌రుగుతోంద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త ఏడాదిన్న‌ర‌లో ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాలు సృష్టించిన‌ట్లు మంత్రి తెలిపారు.

అత్యధిక వృద్థి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఐటీ ఎగుమ‌తులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగిన‌ట్లు మంత్రి చెప్పారు. ఇండియాలో మూడ‌వ వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లో క్రియేట్ అయిన‌ట్లు తెలిపారు. బోష్ అతిపెద్ద కంపెనీ అని, న్యూ ఏజ్ మొబైల్స్‌, కార్ల‌లోనూ సాఫ్ట్‌వేర్ పెరుగుతోంద‌న్నారు. ఆటోమోటివ్ రంగంలో బోష్ మ‌రింత రాటుదేలుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మొబిలిటీ వ్యాలీని సృష్టించేందుకు తెలంగాణ స‌ర్కార్ కృషి చేస్తోంద‌న్నారు. క్వాల్‌కామ్ లాంటి సెమీ కండెక్ట‌ర్ కంపెనీలు హైద‌రాబాద్‌లో దూసుకువెళ్తున్నాయ‌న్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News