Wednesday, January 22, 2025

బాత్‌రూమ్ బ్రేక్ తీసుకుంటే సిక్ లీవులో పొమ్మన్నారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక మహిళ ఇటీవల ఎదుర్కొన్న అనుభవం ఇంటర్‌నెట్ యూజర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న ఆ మహిళ కేవలం 8 నిమిషాలపాటు బాత్‌రూమ్ బ్రేక్ తీసుకున్నందుకు ఆమె బాస్ ఆమెను సిక్ లీవు తీసుకోవాలని లేదా పెయిడ్ టైమ్ ఆఫ్(పిటిఓ) తీసుకోవాలని ఒత్తిడి చేయడం గురించి తెలుసుకుని నెట్ యూజర్లు ఆగ్రహం వ్యతం చేస్తూ ఆ ఉద్యోగిని బాస్ చర్యలను ఖండించారు. తాను వర్క్ ఫ్‌ం హోమ్ చేస్తున్నానని, ఈ రోజు ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు తన వర్క్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చానని ఆమె అమెరికన్ సామాజిక మాధ్యమం రెడిట్‌లో తన అనుభవాన్ని షేర్ చేశారు. వెంటనే తనకు తన బాస్ నుంచి వాయిస్ మెయిల్ వచ్చిందని,

సిక్ లీవు పెట్టుకోవాలని లేదా పిటిఓ తీసుకోవాలని లేనిపక్షంలో తక్షణమే ఆన్‌లైన్‌లో రావాలని బాస్ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆమె తెలిపారు. తాను కేవలం 8 నిమిషాలు మాత్రమే ఆఫ్‌లైన్‌లో వెళ్లానని, ఇంత స్వల్ప విరామానికే తనను సిక్ లీవు పెట్టుకోవాలని బాస్ ఆదేశించడం విని దిగ్భ్రాంతి చెందానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగపరంగా తాను ఎదుర్కంటున్న సమస్యలను ఆమె ఏకరవుపెడుతూ సూపర్‌వైజర్ల నుంచి దూషణలు, నోటీసు లేకుండా హఠాత్తుగా షెడ్యూల్ మార్పులు, ఉద్యోగులకు తగిన నైపుణ్యంలేని బాధ్యతలను అప్పగించడం వంటివి నిత్యం ఎదురవుతుంటాయని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News