Friday, November 15, 2024

బోటానికల్ గార్డెన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొండాపూర్ బోటానికల్ గార్డెన్‌ను దేశ విదేశీ సందర్శకులను ఆకర్శించే విధంగా తీర్చి దిద్దాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎఫ్‌డిసి )చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు . హరితహారంలో భాగంగా ప్రతీ సంవత్సరం నాటే లక్షలాది మొక్కలు నూటికి నూరు శాతం బ్రతికి ఉండేలా చెర్యలు తీసుకొని తద్వారా సంస్థ ఆదాయం పెంచేందుకు దోహద పడాలని అధికారులను ఫీల్ సిబ్బందిని కోరారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ‘వే – ఫార్వర్డ్‘ కార్యక్రమాన్ని కొండాపూర్‌లోని బోటానికల్ గార్డెన్‌లో శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టి. ఎస్. ఎఫ్. డి. సి. చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, రాష్ట్ర నాలుమూలల నుండి విచ్చేసిన కార్పొరేషన్ వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డితో కలిసి టిఎస్‌ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను నాటి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాలని కోరారు.

డివిజనల్ మేనేజర్ లు వారి వారి డివిజన్ లకు సంబంధించి అభివృద్ధి పనులను తమ డివిజన్‌ల వారిగా ఈ సందర్బంగా
పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వారిని అభినందిస్తూ ..అధిక దిగుబడిని పెంచి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచిన సిబ్బందిని టి ఎస్ ఎఫ్‌డిసి కి ‘ఫారెస్ట్ స్టీవార్డు కౌన్సిల్‘ సర్టిఫికెట్ సాధించడాన్ని ఆయన అభినందించారు. ఎకో టూరిజంని తమ కార్పొరేషన్ ద్వారా మరింత అభివృధి చేస్తామని వివరించారు.

వైస్ చైర్మన్, మేనేజంగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బోటానికల్ గార్డెన్ లో నాటిన ఒక జాతి మొక్కను మరలా నాటకుండా వివిధ రకాల జాతుల మొక్కలను 2000 కి పైగా మొక్కలను నాటుతున్నామని వివరించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంను స్ఫూర్తిదయాకంగా తీసుకొని, 50 తీమ్స్, 18 ఫారెస్ట్ టైప్స్, 7 ఎకో సిస్టమ్స్, మొత్తం 75 థీమ్స్ ని, భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా బోటనికల్ గార్డెన్ ను బోటానికల్ పారడైస్ గా తీర్చిదిద్దుతున్నాము వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎం. జె. అక్బర్, జి. ఎం. రవీందర్ రెడ్డి, ఓఎస్‌డి. టిపి. తిమ్మారెడ్డి, సీనియర్ డిఎం , అసిస్టెంట్ డైరెక్టర్ డా. జి. స్కైలాబ్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ప్లాంటేషన్ మేనేజర్ లు లక్ష్మారెడ్డి, మధుసూధన్, బోటనిస్ట్ డా. వీర కిషోర్, ఎకో టూరిజం సిబ్బంది ఎఫ్ డి సి సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News