Thursday, January 23, 2025

దొందూ దొందే !

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  సికింద్రాబాద్ మనదే అని, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సీటు తప్పక గెలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే భిన్నంగా ఈ సారి లోక్‌సభ ఎన్నికలు ఉండబోతున్నాయని ఆయన అ న్నారు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని ఆయన తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ పార్లమెట్ పరిధి బూత్ కమిటీ సమావేశం నామాల గుండు బిఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిం ది. ఈ సమావేశంలో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ రాముడి పేరిట రాజకీయాలు చేయద్దని, రాముడు అందరికీ దేవుడని, మాకు కూడా దేవుడని, మత విభజన పేరిట వైషమ్యాలు సృష్టించొద్దని ఆయన బిజెపి నాయకులకు హితవు పలికారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే అని ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డిని కలవడంలో ఇతర అంశాలే ఏమీ లేవని, వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సిఎంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని ఆ యన స్పష్టం చేశారు. ప్రజలు తరిమికొట్టినా బిఆర్‌ఎస్ నేతల్లో మార్పు కనిపించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయ ని ఆయన జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం క్రమంగా బిఆర్‌ఎస్ కనుమరుగు కావ డం ఖాయమన్నారు. ఎవరొచ్చినా ఇక బిఆర్‌ఎస్ గట్టెక్కించడం కష్టమన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికై నా ప్రజలకు మంచి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. ఆ విషయా న్ని గుర్తించే తమకు అధికా రం కట్టబెట్టారని వెల్లడించారు. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతి బిఆర్‌ఎ స్ శ్రేణులు గుర్తుంచుకోవాలని హిత వు పలికారు. ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ నేతల ఉడుత ఊపులకు కాంగ్రెస్ భయపడదన్నారు.
బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు వేరు కాదు
సమస్యల పరిష్కారమే ఇందిరమ్మ రాజ్యం ఎజెండా అని, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పని చేయాలన్నారు. బి ఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే అని ఆయన అన్నారు. తెలంగాణ ప్ర జలు బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బిఆర్‌ఎస్ ఢిల్లీకి వెళ్లి బిజెపి తెచ్చిన చట్టాలకు మద్దతుగా పార్లమెంట్‌లో ఓట్లు వేశారన్నారు. 10 ఏళ్లలో బిఆర్‌ఎస్ చే సింది అదేనని ఆయన ఆరోపించారు. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు వేరు కాద నీ, రెండు పార్టీలు ఒకటేనన్నారు. కా ంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ నాయకులు అడ్డగోలుగా నోరు పారేసుకుని మాట్లాడటం మానుకోవాలన్నారు. పాలించే నాయకులు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి తప్పా వీధి రౌడీ ల్లా మాట్లాడటం ఏం సంస్కారం? ఇదేనా మీ సంస్కృతి అంటూ ఆయన బిఆర్‌ఎస్ నాయకులపై ఫైర్ అయ్యా రు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బిసి జనగణన చేపట్టామని, ఇందుకు అవసరమైన చర్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. బిసి జనగణన పై కేబినెట్‌లో, అసెంబ్లీలో లోతుగా చర్చించి రాహుల్ గాం ధీ ఇచ్చిన మాటను నిజం చేయబోతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News