Monday, December 23, 2024

జిఎస్ టిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

 

Supreme Court

న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్న( జిఎస్ టి)పై   సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిఎస్ టి  కౌన్సిల్  సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలనుకుంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. పన్నుల విషయంలో 246 ఏ ప్రకారం కేంద్రం, రాష్ట్రం సమానమని, ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆర్టికల్ 246 A ,  279 కింద ఉన్న నిబంధనలు పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి సమాన అధికారాలు ఉన్నాయని , ఒకదానికొకటి స్వతంత్రంగా వ్యవహరించలేవని కోర్టు పేర్కొంది. ఈ నిబంధనలు కాంపిటీటివ్ ఫెడరలిజాన్ని హైలైట్ చేస్తున్నాయని బెంచ్ పేర్కొంది.

ఓడలో వస్తువుల రవాణా సేవలపై 5% ఐజిఎస్‌టి విధించాలని 2017లో ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్‌ను గుజరాత్ హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును గురువారం  సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలున్నాయని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News