Sunday, November 24, 2024

లోక్ సభలోకి దూసుకొచ్చిన ఆగంతకులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ లో బుధవారం కలకలం రేగింది. ఇద్దరు దుండగులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్ సభలోకి దూకారు. కలర్ టియర్ గ్యాస్ విడుదల చేసే వస్తువులను బూట్ల నంచి తీసిన దుండగులు లోక్ సభలో విసిరారు. లోక్ సభ ఎంపిల సీట్లపై నినాదాలు చేస్తూ తిరిగారు. దుండగుల చర్యతో ఎంపిలు భయభ్రాంతులకు గురయ్యారు. సభలో ఏం జరుగుతోందో అర్థం కాక ఆందోళన చెందుతూ పరుగులు పెట్టారు. జీరో అవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్వీకర్ లోక్ సభను వాయిదా వేశారు.

భద్రతా సిబ్బంది దుండగులను అదుపులోకి తీసుకుంది. పార్లమెంటు బయట నినాదాలు చేసిన మహిళ, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. భద్రాతాసిబ్బంది అదుపులో ఉండగా దుండగులు టియర్ గ్యాస్ వదిలారు. 2001లో సరిగ్గా ఇదే రోజు పార్లమెంటుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని స్వీకర్ ఓం బిర్లా వెల్లడించారు. సభలో వదిలిన పొగ.. ప్రమాదకరమైనది కాదు అని లోక్ సభ స్వీకర్ తెలిపారు. మైసూర్ ఎంపి ప్రతాప్ సింహా పేరుతో పాస్ తీసుకుని సభలోకి దుండగులు వచ్చినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News