Wednesday, March 26, 2025

ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంటు

- Advertisement -
- Advertisement -

అధికార ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. సభ్యుల ఆందోళనలతో సభా కార్యక్రమాలు సాగలేదు.. మతపరమైన రిజర్వేషన్లకు వీలుగా రాజ్యాంగాన్ని మార్చాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ వ్యాఖ్యానించారంటూ అధికార బీజేపీ సభ్యులు తీవ్రంగా ఆందోళనకు దిగారు.కాగా, లేని నకిలీ అంశాన్ని ప్రస్తావిస్తూ, అధికార పార్టీ పార్లమెంటును స్తంభింప జేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఫలితంగా సమావేశాలకు అంతరాయం కలిగింది. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బెంగళూరులో డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే లోక్ సభ ఉదయం సమావేశం ముగిసింది కాగా, లోక్ సభ ఆమోదించిన సవరణబిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది.పార్లమెంటు లో కీలక అంశాలు ముఖ్యంగా జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన అంశాన్ని లేవనెత్తకుండా చూసేందుకే అధికార పక్షం రభస చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా లోక్ సభ జరగకుండా ముందే నిర్ణయించినట్లు కన్పిస్తోందనికాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్రా ఆరోపించారు. అధికార పార్టీయే పార్లమెంటును స్తంభింపజేయడం, రాజ్యసభ సమావేశాలను అడ్డుకోవడం దుష్టసంప్రదాయమని తృణమూల్ కాంగ్రెస్ సభాపక్షం నాయకుడు డెరిక్ ఓ బ్రియాన్ ఆరోపించారు.

ముస్లీంల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం పట్ల ఎన్డీఏ ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు.కర్ణాటకలో కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక చేత రాజ్యాంగప్రతిని, మరో చేత డాక్టర్ అంబేద్కర్ పటాన్ని పట్టుకుని మీరు మతపరమైన రిజర్వేషన్లు కోరుతుంటే.. నిబద్ధత గల సభ్యులు ఎలా మౌనంగా ఉంటారనికిరణ్ రిజుజు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని ఆలా డిమాండ్ చేసిన నాయకుడిని బర్తరఫ్ చేయాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న సమయంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండరాదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుస్పష్టమైన ప్రకటన చేసిన విషయాన్ని రాజ్యసభలో బీజేపీ సభా పక్షం నాయకుడు జెపి నడ్డా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. రాజ్యసభ చైర్మన్ మీ డిమాండ్ ఏమిటన్న ప్రశ్నకు కర్ణాటక ప్రభుత్వం ఆ నిబంధనను ఉపసంహరించాలని జెపి నడ్డా అన్నారు.. ఆ సమయంలో రాజ్యసభలోనే ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే స్పందించాలని కోరారు.

డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని, తాము రాజ్యాంగ పరిరక్షకులమే అని మల్లికార్డున ఖర్గే స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య చైర్మన్ రాజ్యసభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు
మంత్రి తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణ్ దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ రాజ్యాంగాన్ని మార్చాలని కోరలేదని ఖర్గే స్పష్టం చేశారు. కేవలం ఆర్ ఎస్ ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్ అలాంటి డిమాండ్ చేశారని పేర్కొన్నారు. జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దగ్ధమైన అంశం సభలో ప్రస్తావనకురాకుండా అధికార పక్షం రభస చేస్తోందని ఖర్గే విమర్శించారు. అదే సమయంలో ముస్లింలను ఓబీసీలలో చేర్చడం ద్వారా, కర్ణాటకతో పాటు, తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దొడ్డి దారిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని జేపి నడ్డా విమర్శించారు..నినాదాలు మార్మోగడంతో సభను 15 నిముషాల పాటు వాయిదా వేశారు. కాగా, లోక్ సభ ఉదయం, మధ్యాహ్నం కార్యకలాపాలు సాగలేదు. తర్వాత 2025 ఫైనాన్స్ బిల్లుపై సభ చర్చించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News