Sunday, December 22, 2024

పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు (లోక్ సభ, రాజ్యసభ) నిరవధిక వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. ఆరు రోజులు ముందుగానే వాయిదాకు గురయ్యాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 7న మొదలయ్యాయి.

సమావేశాల ముగింపు నిర్ణయాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో  తీసుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అధికార, ప్రతిపక్షాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశాలలో 97 శాతం ఉత్పాదకత రేటు నమోదైనట్టు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మొత్తం 62 గంటల 42 నిమిషాల పాటు పనిచేసినట్టు చెప్పారు. చివరి రోజు శుక్రవారంనాడు కూడా పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ నియంత్రణ రేఖ వద్ద చైనా, భారత్ బలగాల ఘర్షణ అంశం ఈ విడత సమావేశాలను కుదిపేసిన వాటిల్లో ప్రధానమైనది. దీన్ని అడ్డం పెట్టుకుని అధికార బిజెపిని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News