- Advertisement -
న్యూఢిల్లీ: 18వ లోక్ సభ సమావేశాలు 22 జూన్ నుంచి 9 ఆగస్టు 2024 వరకు జరిగాయిని లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా అన్నారు. దాదాపు 115 గంటలపాటు కార్యకలాపాలు(ప్రొసీడింగ్స్) కొనసాగాయన్నారు. బడ్జెట్ ను జూన్ 23న ప్రవేశపెట్టగా, ఫైనాన్స్ బిల్ పై చర్చ జరిగిందన్నారు. కాగా స్పీకర్ నేడు లోక్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
న్యూఢిల్లీలో గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి అనర్హత వేటు వేయడంపై ప్రతిపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్ ఖర్ తన కుర్చీని విడిచిపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ ప్రవర్తించిన తీరును జగదీప్ ధన్ ఖర్ ఖండించారు. కాగా గందరగోళం మధ్య రాజ్యసభ కూడా నేడు నిరవధికంగా వాయిదా పడింది.
- Advertisement -