Friday, December 20, 2024

అమలాపురం ఘటన దురదృష్టకరం: బొత్స

- Advertisement -
- Advertisement -

Botsa-Satyanarayana

 

అమరావతి: అమలాపురం ఘటన దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  ఇలాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. అంబేద్కర్ ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. పచ్చని కోన సమీలో చిచ్చుపెట్టాలని చూశారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్ ఆలోచన చేస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలన్న నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని చురకలంటించారు. కాల్పులు జరిగితే లబ్ధి పొందాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తున్నారని విరుచుకపడ్డారు. పోలీసుల సంయమనంతోనే ప్రాణనష్టం లేకుండా నివారించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News