Monday, December 23, 2024

ఉద్యోగులు అలుసుగా తీసుకోవద్దు: బొత్స

- Advertisement -
- Advertisement -

Botsa-Satyanarayana

హైదరాబాద్: ఉద్యోగుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పిఆర్‌సి సాధన సమితి తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరికి రూపాయి కూడా తగ్గేది లేదని, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఘర్షణ వాతావరణం వద్దని సలహా ఇచ్చారు. తాము నాలుగు మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నామని, దాన్ని ఉద్యోగులు అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు.ఇకపై చర్చల కోసం సంప్రదింపుల కమిటీ ఎదురుచూపులు ఉండవని, ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలు జరుపుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News