Wednesday, January 22, 2025

తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు: బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని తెలంగాణలో పోల్చి చూడటం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో ట్రిపుల్ ఐటి ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని, ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణలో దాపురించిందని ఎద్దేవా చేశారు. మన విధానం మనదని, మన ఆలోచనలు మనవి అని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. వాలంటీరీ వ్యవస్థ ఎలా పుట్టిందో పవన్ తెలుసుకుంటే బాగుంటుందని బొత్స హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉందని, దీనిపై అసత్య ప్రచారాలు చేయడం తగదని సూచించారు.

Also Read: పెళ్లి మాట విని రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News