Monday, December 23, 2024

సీమెన్స్ కంపెనీ వాటా ఎందుకివ్వలేదు చంద్రబాబు: బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: అవినీతి చేసినవారు ఎంతటివారైనా చర్యలు తప్పవని మంత్ర బొత్స సత్యనారాయణ తెలిపారు. డొల్ల కంపెనీలకు ప్రభుత్వ సొమ్మును తరలించారని దుయ్యబట్టారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, అవినీతిని వైసిపి ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే కుదరదని, అధికారుల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒత్తిడి చేయడం వల్లే నిధుల విడుదల ఆగిపోయాయని, స్కిల్ స్కామ్ అధికారుల పాత్ర ఉంటే వారిపైనా చర్యలు తీసుకుంటామని బొత్స హెచ్చరించారు.

Also Read: మహాలయ పక్షాలు – విశిష్టత

దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్లు చంద్రబాబు ఇన్నాళ్లు వ్యవహరించారని బొత్స దుయ్యబట్టారు. ఎపి ప్రభుత్వ వాటా ఇచ్చాక సీమెన్స్ కంపెనీ వాటా ఎందుకివ్వలేదని, చంద్రబాబు తెలిసే తప్పు చేశారని విమర్శించారు.  సిపిఎస్ రద్దు అనే అంశం ముగిసిన అధ్యాయం అని, జిపిఎస్ అనేది తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో తాము ఇంతకు మించి చేయలేమని,  సిపిఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని బొత్స విన్నవించారు. సిపిఎస్ విధానం రద్ధును కేంద్రం ఎందుకు ఆమోదించడంలేదని బిజెపోళ్లను ప్రశ్నించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News