Monday, January 20, 2025

సినీ పరిశ్రమ పిచ్చుక అని చిరు ఒప్పుకున్నారా?: బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకున్నారా?… చిరంజీవి చెప్పాలి? అని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఎపిలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని, మెగస్టార్ చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని బొత్స సత్యనారాయణ నిలదీశారు. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుందని, చిరంజీవి వ్యాఖ్యలు చూశాక పూర్తి స్థాయిలో స్పందిస్తామన్నారు. జనసేన వారాహి యాత్రను అడ్డుకోమని, ప్రజస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేయవచ్చని బొత్స సత్యనారాయణ అని అన్నారు. యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోమని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News