హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు బిసిసిఐ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుమ్రాలో స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నది జట్టు యజమాన్యం ఆలోచనలో పడింది. సిరాజ్‌తో ఫాస్ట్ బౌలింగ్ సేవలు అందించేందుకు ఆకాశ్‌దీప్, ముఖేశ్ కుమార్ పోటీలో ఉన్నారు. విశాఖ టెస్టులో ముఖేశ్ కుమార్ 12 ఓవర్లు వేసి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇంగ్లాండ్ పదో నంబర్ బ్యాటర్ షోయబ్ బషీర్ మాత్రమే ఔట్ చేశాడు. విశాఖ టెస్టులో ముఖేశ్ విఫలం కావడంతో బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఆకాశ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకాశ్‌దీప్ 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 104 వికెట్లు తీసి మంచి ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత్-ఎ- ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో పది వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దీంతో అతడి వైపు సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది.
బుమ్రాకు బదులు ఆకాశేనా?
- Advertisement -
- Advertisement -
- Advertisement -