Sunday, December 22, 2024

బ్యాట్స్‌మెన్ బంతిని కొడితే… బౌలర్ ముఖం పచ్చడైంది

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని బలంగా కొట్టడంతో బౌలర్ ముఖానికి తాకి తీవ్రంగా గాయపడ్డాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్, సీటెల్ ఆర్కాస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా బౌలర్ కార్మి రౌక్స్ మూడో ఓవర్‌లో బంతి వేశాడు. సీటెల్ ఆర్కాస్ జట్టు బ్యాట్స్‌మెన రైన్ రికెల్టన్ బంతిని బలంగా స్ట్రైక్‌గా కొట్టాడు. బంతి వెళ్లి రౌక్స్ ముఖానికి తాకడంతో విలవిలలాడుతూ కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది మైదానంలోకి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. కాసేటికి కోలుకున్న రౌక్స్ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రౌక్స్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంఎల్‌సి తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News