Saturday, December 21, 2024

షమీకి గాయం… జట్టులోకి ఉమ్రాన్ మాలిక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా పేస్ బౌలర్ షమీకి గాయం కావడంతో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌కు దురమయ్యాడు. రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. సిరీస్ కు ముందు షమీ లేకపోవడంతో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. షమీకి బదులుగా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకున్నామని బిసిసిఐ వెల్లడించింది. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయాలతో సతమవుతుండడంతో వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన లోటు కనిపించింది. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్ ముందు నిర్వహించిన ట్రైనింగ్ సెషన్‌లో షమీ గాయపడ్డాడు. బంగ్లాతో వెళ్లే టీమ్‌లో అతడు లేడని బిసిసిఐ పేర్కొంది. ప్రపంచకప్ టెస్టు ఛాంపియన్  షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ప్రతి మ్యాచ్‌లో ఇండియా గెలవాలి. 60 టెస్టులు ఆడిన షమీ 216 వికెట్లు తీసుకున్నారు.

టీమిండియా జట్టు సభ్యులు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్(వైఎస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, సిరాజ్, దిపక్ చాహర్, కుల్‌దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News