- Advertisement -
తిరువనంతపురం: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు శ్రీశాంత్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2013 ఐపిఎల్ సీజన్ సందర్భంగా శ్రీకాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బిసిసిఐ అతనిపై ఏడేళ్ల పాటు నిషేధం విధించింది. 2020 సెప్టెంబర్‌లో అతనిపై ఉన్న నిషేధం తొలగిపోయింది. అయినా కూడా శ్రీశాంత్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. అంతేగాక ఇటీవల ముగిసిన ఐపిఎల్ వేలం పాటలో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకోలేడు. ఇక శ్రీశాంత్ 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక 53 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 75 వికెట్లు తీశాడు. 10 టిల్లోనూ భారత్ తరఫున ఆడాడు. ఐపిఎల్‌లో 40 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లను పడగొట్టాడు.
- Advertisement -