- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయి మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్‌ను రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సన్మానించారు. నిఖత్ శనివారం శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జయేష్ రంజన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిఖత్ జరీన్‌ను సన్మానించారు. రానున్న ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచ బాక్సిగ్ పోటీల్లో నిఖత్ పతకం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల హర్యానాలో జరిగిన జాతీయ బాక్సింగ్‌లో నిఖత్ 52 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. దీంతో టర్కీ వేదికగా వచ్చే నెలలో జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నిఖత్ అర్హత సాధించింది.
- Advertisement -