Tuesday, April 1, 2025

ఎల్లుండి రాష్ట్రానికి ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్ జరీన్

- Advertisement -
- Advertisement -

World boxing champion Nikhat Zareen is coming to Telangana

ఘన స్వాగతానికి క్రీడా శాఖ ఏర్పాట్లు

హైదరాబాద్ : తెలంగాణ ఆణిముత్యం కుమారి నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ విజేతగా తొలిసారి రాష్ట్రానికి వస్తోంది. ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు ఆమె రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలుకనున్నారు. ఇందుకు సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాను క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కెజీల విభాగంలో మన రాష్ట్రానికి చెందిన యువ బాక్సర్ కుమారి నిఖత్ జరీన్ అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన నిఖత్ జరీన్‌కు, జర్మనీలోని సూల్ నగరంలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి అదే రోజు రాష్ట్రానికి వస్తున్న సికిందరాబాద్‌కు చెందిన ఇషా సింగ్‌లకు కనీ వినీ ఎరగని రీతిలో ఇతర క్రీడాకారులకు స్పూర్తిని నింపేలా ఘన స్వాగతం పలుకడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను, సాంస్కృతిక శాఖ సంచాలకులను, క్రీడా శాఖ అధికారులను క్రీడా పాఠశాల అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News