ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్
బెల్‌గ్రేడ్: సెర్బియా వేదికగా జరుగుతున్న పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నిశాంత్ దేవ్, సంజీత్ కుమార్‌లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ పోటీల్లో వీరు విజయం సాధించి ముందంజ వేశారు. 71 కిలోల విభాగం ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో నిశాంత్ దేవ్ 32 తేడాతో మెక్సికోకు చెందిన మార్కొ అల్వరేజ్‌ను చ్తిత చేశాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన నిశాంత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
తర్వాతి మ్యాచ్‌లో రష్యా బాక్సర్ వదిమ్ ముసావ్‌తో నిశాంత్ తలపడుతాడు. మరో ప్రీక్వార్టర్ ఫైనల్ సమరంలో ఆసియా చాంపియన్ సంజీత్ కుమార్ 41 తేడాతో జార్జియా బాక్సర్ గియోర్గిను చిత్తు చేశాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సంజీత్ ఏ దశలోనూ పట్టు సడలించలేదు. ఆఖరు వరకు దూకుడును ప్రదర్శిస్తూ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో ఇటలీ బాక్సర్ అజీజ్ అబ్బాస్‌తో సంజీత్ తలపడుతాడు. మరోవైపు రోహిత్ మోర్ (57 కిలోలు), ఆకాశ్ సంగ్వాన్ (67 కిలోలు) ప్రీక్వార్టర్ ఫైనల్ దశలోనే ఓటమి పాలయ్యారు.