Friday, December 20, 2024

బైక్‌లు చోరీ చేస్తున్న బాయ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బైక్‌లను చోరీ చేస్తున్న బాలుడిని బహదుర్‌పుర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుడి వద్ద నుంచి పది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఈ నెల 16వ తేదీన తన బైక్ పోయిందని ఎడి జావీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బహదుర్‌పుర డిఐ రాజు తాడ్‌బన్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బాలుడు ఎండి సోహైల్ హుస్సేన్(14) బైక్‌పై అనుమానస్పదంగా కన్పించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని బైక్ పత్రాలు చూపించాలని కోరగా లేవని సమాధానం ఇచ్చాడు.

అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ల చోరీ విషయం బయటపడింది. బాలుడు చార్మినార్, చార్మినార్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు పది బైక్‌లను చోరీ చేసినట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఐ రాజు, ఎస్సైలు శ్రీకాంత్, పిసిలు నాగరాజు, అరుణ్‌కుమార్‌ను ఎసిపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News