ఢిల్లీ: 11 ఏళ్ల బాలుడి మృతదేహం బెడ్‌బాక్స్ లోపల కనిపించిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నీలు అనే మహిళ తన భర్త జితేంద్రతో విడాకులు తీసుకొని తన కుమారుడితో కలిసి ఉంటుంది. గురువారం ఆమె ఇంటికి వచ్చేసరికి ఇంటికి లాక్ చేసి ఉండడంతో వాకింగ్‌కు పోయి ఉంటాడని భావించింది. డ్యాన్ టీచర్ ఆమెకు ఫోన్ చేసి కుమారుడ్ రాలేదని చెప్పడంతో కంగారు పడింది. నీలు తన మాజీ భర్త జితేంద్రకు ఫోన్ చేసి బాలుడు కనిపించడంలేదని చెప్పడంతో ఓ మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి ప్రియమైన కుమారుడు కనిపించడం లేదా? అని ఎద్దేవా చేసినట్లుగా మాట్లాడింది. ఇంట్లో వెతకగా బెడ్ కింద బాక్స్‌లో బాలుడు కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు చనిపోయాడని వెల్లడించారు. ఇంటి నుంచి ఓ వ్యక్తి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. జితేంద్ర తరుపు కుటుంబ సభ్యులు బాలుడిని చంపించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెడ్‌బాక్స్ లోపల కుమారుడి మృతదేహం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -