Monday, December 23, 2024

జాతరకు డబ్బు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గోరంట్ల శివ ( 14) అనే బాలుడు తెల్కపల్లి ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ‌ శివ రంగాపూర్ జాతర వెళ్లడానికి డబ్బులు అడగగా వేరుశనగ పంటకు మందులు పిచికారి చేయాలని డబ్బులు లేవని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన శివ మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News