Saturday, December 21, 2024

బాలుడి ప్రాణం తీసిన అగ్గిపెట్టె

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: అగ్గిపెట్టెతో ఆడుకుంటూ నిప్పు అంటుకోవడంతో బాలుడు చనిపోయిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కోరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోన్ హట్ లో వివాహ వేడుక నిమిత్తం ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఒక అగ్గి పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. గడ్డి వాము దగ్గరికి వెళ్లి అగ్గి పెట్టెతో మంట అంటించడంతో గడ్డి వాములో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. బాలుడు మంటలలో చిక్కుకొని కేకలు వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే బాలుడు పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాధేనగర్ నుంచి పెళ్లి వేడుకల నిమిత్తం ఇక్కడికి వచ్చామని బాలుడి తండ్రి రాహమ్ లాల్ పాండో చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News