Friday, December 27, 2024

ప్రీ వెడ్డింగ్ వేడుకలో కాల్పులు…. బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ప్రీ వెడ్డింగ్ వేడుకలో కాల్పులు జరపడంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాన్పూర్ ప్రాంతంలోని లాల్‌చంద్‌వాలా గ్రామంలో ఆజాద్ అనే వ్యక్తి తన కుమారుడు ఫిరోజ్ వివాహం జరిపిస్తున్నాడు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు వాషీమ్ రహీమ్ తన కుమారుడు రెహాన్ అహ్మద్‌తో కలిసి హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా అందరూ డ్యాన్స్‌లు చేస్తుండగా ఒకరు గన్ తీసుకొని కాల్పులు జరిపారు. బుల్లెట్ వెళ్లి రెహాన్‌కు తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి కుమారుడి కుటుంబం సభ్యులు పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News