- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలో జిల్లాలోని పెనుకొండలో గురువారం ఉదయం దర్గా ఆవరణలో మురుగునీటి గుంతలో పడిన బాలుడి మృతదేహం కనిపించింది. పెనుకొండలోని బాబయ్యస్వామి దర్గా గంధం వేడుకలలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహ్మద్ అల్మాన్ (4) మురుగునీటి గుంతలో శవమై తేలాడు. కుమారుడు అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం దర్గ ఆవరణలోని మురుగునీటి గుంతలో బాలుడి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతమయ్యారు. దేవుడు రక్షిస్తాడని దర్గాకు కుటుంబంతో కలిసి వస్తే తన కుమారుడిని దేవుడు వద్దకే తీసుకెళ్లాడని శోకసంద్రంలో వారు మునిగిపోయారు. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్గాను సందర్శించడానికి కర్ణాటక నుండి పెనుకొండకు వారు వచ్చారు.
- Advertisement -